PBKS vs CSK: దూబే గోల్డెన్ డ‌క్.. చెన్నైకి షాక్‌ల మీద షాక్‌లు

PBKS vs CSK: దూబే గోల్డెన్ డ‌క్.. చెన్నైకి షాక్‌ల మీద షాక్‌లు

ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లు తడబడుతున్నారు. 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ మాత్రమే కోల్పోయిన చెన్నై.. తదుపరి రెండు ఓవర్లు గడిచేసరికి ఏకంగా 4 వికెట్లు కోల్పోయింది. పంజాబ్ స్పిన్నర్ రాహుల్ చాహ‌ర్ ఒకే ఓవ‌ర్‌లో రుతురాజ్(32), శివమ్ దూబే(0) ఔట్ చేసి.. చెన్నైని దెబ్బతీశాడు. ప్రస్తుతం స్కోర్.. 10 ఓవర్లలో 79/4.

టాస్ ఓడి బ్యాటింగ్‪కు దిగిన చెన్నై.. ఆదిలోనే అజింక్యా ర‌హానే(9) వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్‌ ఓవర్‌లో భారీ షాట్ కు యత్నించిన రహానే.. రబాడకు దొరికిపోయాడు. ఆ తరువత క్రీజులోకి డారిల్ మిచెల్ (30).. రుతురాజ్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాడు.  వీరిద్దరి ధాటికి చెన్నై.. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆ సమయంలో స్ట్రాటజిక్‌ టైమౌట్‌ తీసుకున్న పంజాబ్.. తిరిగి ఆట ప్రారంభం కాగానే వికెట్ల వేట మొదలు పెట్టింది. 

రాహుల్ చాహర్ వేసిన 8వ ఓవర్ మొదటి బంతికే రుతురాజ్ (32) ఔటయ్యాడు.  ఆ మరుసటి బంతికి శివమ్‌ దూబె (0) పెవిలియన్‌ చేరాడు. హర్షల్ పటేల్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో డారిల్ మిచెల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో చెన్నై 75 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా (1), మొయిన్ అలీ (5) క్రీజులో ఉన్నారు.