కరోనా వైరస్ నియంత్రణకు లాక్‌డౌన్ సరిపోదు

కరోనా వైరస్ నియంత్రణకు లాక్‌డౌన్ సరిపోదు

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్‌డౌన్ పర్మినెంట్ సొల్యూషన్ కాదని ఆక్స్‌వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునేత్ర గుప్తా అన్నారు. మనలో చాలా మందికి కరోనా వ్యాక్సిన్ అవసరం లేదని, లాక్‌డౌన్ దీర్ఘ కాల పరిష్కారం కాదని ఓ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. ‘వయస్సు పైబడిన వృద్ధులు, బలహీనంగా ఉన్న వారిలా ఆరోగ్యవంతులు కూడా భయపడుతున్నారు. ఈ వైరస్ గురించి అంతగా ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు. ఇది కూడా ఫ్లూ లాంటిదే. మనలో చాలా మందికి కరోనా గురించి చింతించాల్సిన అవసరం లేదు. తక్కువ మరణాలు నమోదవుతున్న దృష్ట్యా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను డెవలప్ చేయడం సులువే. ఈ సమ్మర్ ముగిసే లోపు టీకా పని చేస్తుందని రుజువు చేయాలి. వైరస్‌ను నిలువరించడానికి లాక్‌డౌన్ మంచి నిర్ణయమే అయినప్పటికీ ఎక్కువ రోజులు కరోనాను నియంత్రించడానికి ఇది సరిపోదు. ఏదేమైనప్పటికీ లాక్‌డౌన్‌ను కొన్ని దేశాలు సమర్థంగా నిర్వహించాయి. కానీ ఆయా దేశాలు వైరస్‌ను మళ్లీ ఎదుర్కోవాల్సి వస్తోంది’ అని సునేత్ర చెప్పారు.