రాయ్​బరేలీలో రాహుల్ పూజలు

రాయ్​బరేలీలో రాహుల్ పూజలు

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాయ్​బరేలీలోని పిపలేశ్వర హనుమాన్ ఆలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన పోటీ చేస్తున్న రాయ్​బరేలీ సెగ్మెంట్​లోని పలు పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. పలువురు ఓటర్లు ఆయనతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. కొందరు జర్నలిస్టులు రాహుల్​తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాహుల్ వెంట పలువురు కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. బీజేపీ తరఫున రాహుల్​పై పోటీ చేస్తున్న దినేశ్ ప్రతాప్ సింగ్.. గోరా బజార్​లోని కేంద్రీయ విద్యాలయ్​లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.