తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఇటీవల చోటుచేసుకున్న వ్యాఖ్యలపై హీరోయిన్ త్రిష ఘాటుగా స్పందించారు. తమిళ్ బీజేపీ నాయకుడు నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆమె, తనను అనవసర రాజకీయ వివాదాల్లోకి లాగితే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లేటెస్ట్గా హీరోయిన్ త్రిష X వేదికగా నోట్ రిలీజ్ చేసి లీగల్ వార్నింగ్ ఇచ్చింది.
త్రిష విడుదల చేసిన నోట్లో, తనపై తప్పుడు ఆరోపణలు చేసి.. ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. “నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. నా పేరును వాడుకొని అనవసర వ్యాఖ్యలు చేయడం అసహ్యకరం. ఈ విధమైన నిరాధార ఆరోపణలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది,” అని ఆమె స్పష్టం చేశారు.
ALSO READ : తొలి శుభలేఖ మామయ్యకే..
నటి వ్యాఖ్యలతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో అభిమానులు ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. రాజకీయ వర్గాల నుంచి కూడా ఈ వివాదంపై స్పందనలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నయినార్ నాగేంద్రన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనే ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయ మరియు సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.
Disrespect should and always will be called out. pic.twitter.com/FmXdIBvAJ6
— Trish (@trishtrashers) February 16, 2026
ఇకపోతే, రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత స్థానం కలిగిన వ్యక్తి ఇలాంటి అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేస్తారని తమ క్లయింట్ ఎప్పుడూ ఊహించలేదని త్రిష తరుపు లాయర్ నిత్యేశ్ నటరాజ్ పేర్కొన్నారు. త్రిషకు ఎలాంటి రాజకీయ పార్టీలతో అనుబంధం లేదని, భవిష్యత్తులోనూ అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గతంలోనూ రాజకీయాల విషయంలో తాను తటస్థ వైఖరినే అనుసరించానని ఆమె తరఫున తెలిపారు.
నయినార్ నాగేంద్రన్ ఏమన్నాడంటే?
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్.. ఇటీవలే చెన్నై విమానాశ్రయంలో 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) అధినేత, హీరో దళపతి విజయ్‌పై (Nainar Nagendran) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రాన్ని నడిపించే ముందు వ్యక్తిగత, కుటుంబ విషయాలను సరిచేసుకోవాలని ఆయన సూచించారు. కుటుంబంతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు, గొప్ప నాయకులు తమ ఉద్యమాలను ఎలా నిర్మించారో తెలుసుకోవాలని సూచించారు.
ALSO READ : ఒకే కారులో కనిపించిన విజయ్–రష్మిక.!
అంతేకాకుండా 'విజయ్‌కు ఏమీ తెలియదు. అతనికి అనుభవం లేదు. ముందుగా అతను తన ఇంటి నుంచి బయటకు వచ్చి చూడమనండి. దానికంటే ముందు అతను త్రిష నుంచి దూరమై బయటకు వస్తేనే వాస్తవాలను గ్రహించగలడు' అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై త్రిష వార్నింగ్ ఇస్తూ నోట్ రిలీజ్ చేయడంతో ఉత్కంఠ కలిగిస్తోంది.
