కామారెడ్డి/ఆదిలాబాద్: కామారెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కామారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఇప్ప ఉమారాణిని చైర్ పర్సన్ పీఠం వరించింది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఉమారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేది లేదంటూ కామారెడ్డిలోని బీఆర్ఎస్ పార్టీ నేతలు తేల్చి చెప్పారు. దాంతో తాజాగా పార్టీలో చేరిన ఇప్ప ఉమారాణి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రతిపా దించింది. బీజేపీ నుంచి సుజిత కోటి చైర్ పర్సన్ పదవికి పోటీలో నిలిచారు. మరోవైపు వైస్ చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరారు. కాంగ్రెస్ ఒప్పుకోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతుతో ఉమారాణి చైర్ పర్సన్ గా ఎన్నియ్యారు. వైస్ చైర్ పర్సన్ గా బీఆర్ఎస్ కు చెందిన కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు.
ఆదిలాబాద్ లో 45వ వార్డు నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా గెలిచిన అనూష అనూష బండారి పర్సన్ గా ఎన్నికయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ వ్యూహం ఫలించింది. ఆ పార్టీకి బీఆర్ఎస్ జత కట్టడంతో ఎంఐఎం, ఇండిపెండెంట్ల మద్దతుతో బీజేపీకి బల్దియా పీఠం దక్కకుండా పంతం నెగ్గించుకుంది. బండారి అనూషకు 11 మంది కాంగ్రెస్, ఐదుగురు బీఆర్ఎస్, ఆరుగురు ఎంఐఎం, ఐదుగురు ఇండి పెండెంట్లు మద్దతు పలికారు. దీంతో 27 ఓట్లతో చైర్ పర్సన్ గా గెలిచారు. బల్దియా పీఠం కైవసం చేసుకునే ప్రయత్నంలో భాగంగా మధ్యప్రదేశ్ రిసార్ట్ లో 21 మంది కౌన్సిలర్లతో క్యాంపు నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు ఊహించని షాక్ తగిలింది. ముగ్గురు ఇండిపెండెం ట్ల మద్దతుతో బీజేపీకి చైర్మన్ పీఠం దక్కుతుందని అందరూ ఊహించగా, అంచనాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి.
