డెహ్రాడూన్: బద్రీనాథ్‌లోనూ విరాళాలు మాయం!..ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించిన ఆలయ కమిటీ

డెహ్రాడూన్:  బద్రీనాథ్‌లోనూ విరాళాలు మాయం!..ఇంటర్నల్  ఎంక్వైరీకి ఆదేశించిన ఆలయ కమిటీ

డెహ్రాడూన్: అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండగా, తాజాగా బద్రీనాథ్ ధామ్‌లోనూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. భక్తులు సమర్పించిన కానుకల విషయంలో అవకతవకలు జరిగాయని సోషల్ మీడియాలో వార్తు వైరల్ అవుతున్నాయి. ఈ ఆరోపణలను బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) తీవ్రంగా పరిగణించింది. 

నిజానిజాలు తెలుసుకునేందుకు ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చింది. సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణ కూడా కోరింది. శుక్రవారం భైరవ్ సేన అనే సంస్థ బద్రీనాథ్ ధామ్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపించింది. బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది వ్యక్తిగత సహాయకుడికి సంబంధించి నిధుల దుర్వినియోగంపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేసింది.