నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీపై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీపై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన

హైదరాబాద్: ఎంతో కాలంగా పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తర్వలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనట్లు ప్రకటించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. వివిధ విభాగాల్లో మొత్తం 7,437 పోస్టులు భర్తీ చేయనట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం (జులై 5) ఖాళీల వివరాలను ప్రకటించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. 

స్థానిక కేడర్, రోస్టర్, అర్హతల వివరాలు ఖరారైన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాగా, మూడు రోజుల క్రితమే పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 5వేల ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, నిరుద్యోగుల అభ్యర్థన మేరకు తాజాగా మరో 2,437 పోస్టులను ప్రభుత్వం పెంచింది.  ఇందులో ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో 790, జైల్ విభాగంలో 223, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 1,424 పోస్టులున్నాయి. 

7,437 పోలీస్ ఉద్యోగాలు.. విభాగాల వారీగా ఖాళీలివే

  • సివిల్ SI-148

  • రిజర్వ్ SI(AR)-14

  •  రిజర్వ్ SI (TGSP)-12

  • రిజర్వ్ SI (SARCPL)-3

  • ASI (FPB)-23

  •  సివిల్ కానిస్టేబుల్-3,697

  • AR కానిస్టేబుల్-1,052

  • SARCPL కానిస్టేబుల్-24

  • కానిస్టేబుల్ (డ్రైవర్) PTO-20

  • మెకానిక్-7 

  • ఫైర్ డిపార్ట్మెంట్

  • స్టేషన్ ఆఫీసర్-39
    ఫైర్ ఫైటర్-751

     జైలు: 

    డిప్యూటీ జైలర్(మెన్)-14
    ఉమెన్-1
    వార్డెన్(మేల్)-196
    ఫిమేల్-12

    స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్

  •  SI-44 
    కానిస్టేబుల్-1,380