వింబుల్డన్‌‌‌‌లో సంచలనం.. మూడో రౌండ్‌‌‌‌లోనే స్వైటెక్‌‌‌‌ ఔట్‌‌‌‌

వింబుల్డన్‌‌‌‌లో సంచలనం.. మూడో రౌండ్‌‌‌‌లోనే స్వైటెక్‌‌‌‌ ఔట్‌‌‌‌

లండన్‌‌‌‌: వింబుల్డన్‌‌‌‌లో సంచలనం నమోదైంది. టైటిల్‌‌‌‌ ఆశలతో బరిలోకి దిగిన పోలెండ్‌‌‌‌ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఇగా స్వైటెక్‌‌‌‌ మూడో రౌండ్‌‌‌‌లోనే ఇంటిముఖం పట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో 29వ సీడ్‌‌‌‌ అలెగ్జాండర్‌‌‌‌ ఈలా (చెక్‌‌‌‌) 7–6 (11/9), 6–2తో స్వైటెక్‌‌‌‌పై గెలిచింది. రెండు గంటలా 15 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో ఈలా అటాకింగ్ గేమ్‌‌‌‌ ఆడింది. ఒక్క డబుల్‌‌‌‌ ఫాల్ట్‌‌‌‌ కూడా చేయకుండా తన సర్వీస్‌‌‌‌లో 62 శాతం పాయింట్లు రాబట్టింది. 7 బ్రేక్‌‌‌‌ పాయింట్లలో ఐదింటిని కాచుకుంది. 

24 విన్నర్లు, 21 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేసింది. 4 ఏస్‌‌‌‌లు కొట్టింది. 5 డబుల్‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌ చేసిన స్వైటెక్‌‌‌‌ 44 అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌తో మూల్యం చెల్లించుకుంది. మరో మ్యాచ్‌‌‌‌లో ఎలైస్‌‌‌‌ మార్టినెజ్‌‌‌‌ (బెల్జియం) 7–6 (7/4), 6–1తో రెండోసీడ్‌‌‌‌ ఎలెనా రిబకినా (కజకిస్తాన్‌‌‌‌)కు షాకిచ్చింది. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో మార్టా కోస్టుక్‌‌‌‌ (ఉక్రెయిన్‌‌‌‌) 6–2, 4–6, 6–1తో ఎమ్మా నవారో (అమెరికా)పై, పౌలిని (ఇటలీ) 6–1, 6–2తో సక్కారీ (గ్రీస్‌‌‌‌)పై, బౌజుకోవా (చెక్‌‌‌‌) 4–6, 7–6 (7/3), 6–4తో సమ్సనోవా (రష్యా)పై, క్రుగెర్‌‌‌‌ (అమెరికా) 6–3, 6–2తో డారియా సిగ్నుర్‌‌‌‌ (ఉక్రెయిన్‌‌‌‌)పై గెలిచారు. 

మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ మూడో రౌండ్‌‌‌‌లో రెండోసీడ్‌‌‌‌ అలెగ్జాండర్‌‌‌‌ జ్వెరెవ్‌‌‌‌ (జర్మనీ) 6–2, 7–6 (7/4), 6–4తో మార్కోస్‌‌‌‌ గిరోన్‌‌‌‌ (అమెరికా)పై, డి మినుయెర్‌‌‌‌ (ఆస్ట్రేలియా) 6–2, 5–7, 6–2, 6–4తో స్వజ్దా (అమెరికా)పై, కోబలీ (ఇటలీ) 0–6, 7–6 (7/4), 6–7 (5/7), 6–2, 6–2తో కచనోవ్‌‌‌‌ (రష్యా)పై  గెలిచాడు.