సాయి సుదర్శన్‌‌‌‌ భారీ సెంచరీ.. ఆధిక్యంలో ఇండియా–ఎ 

 సాయి సుదర్శన్‌‌‌‌ భారీ సెంచరీ.. ఆధిక్యంలో ఇండియా–ఎ 

గాలె: శ్రీలంక–ఎతో జరుగుతున్న అనధికార రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా–ఎ 175 రన్స్‌‌‌‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. సాయి సుదర్శన్‌‌‌‌ (168) భారీ సెంచరీతో చెలరేగడంతో.. 247/1 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా–ఎ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 142 ఓవర్లలో 541/8 స్కోరు చేసింది. సారాన్ష్‌‌‌‌ జైన్‌‌‌‌ (68 బ్యాటింగ్‌‌‌‌), యష్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ (2 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌ (94) త్వరగా ఔటైనా.. సుదర్శన్‌‌‌‌, ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ (53) మూడో వికెట్‌‌‌‌కు 120 రన్స్‌‌‌‌ జోడించారు. షేక్‌‌‌‌ రషీద్‌‌‌‌ (45)తో ఐదో వికెట్‌‌‌‌కు 54 రన్స్‌‌‌‌ జోడించిన జైన్‌‌‌‌.. అకీబ్‌‌‌‌ నబీ (30)తో ఆరో వికెట్‌‌‌‌కు 81 రన్స్‌‌‌‌ జత చేశాడు. కేశర నువాంత 4,  సుదీరా 3 వికెట్లు పడగొట్టారు.