బోరబండ ఎస్సై సస్పెన్షన్

బోరబండ ఎస్సై సస్పెన్షన్

జూబ్లీహిల్స్, వెలుగు: బోరబండ ఎస్సై షేక్ నాగుల్ మీరాపై నగర పోలీస్​కమిషనర్ శనివారం సస్పెన్షన్ వేటు వేశారు. షేక్ నాగుల్ మీరా ఆర్టీసీ కండక్టర్ షేక్ రహేమాను 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. బోరబండలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆయన నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌‌లో పని చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌‌తో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని భార్య గతంలో డీజీపీ, హైదరాబాద్ పోలీస్​కమిషనర్‌‌కు ఫిర్యాదు చేసింది.

దీంతో అధికారులు ఎస్సైతోపాటు మహిళా కానిస్టేబుల్‌‌ను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి, హెచ్చరించారు. అయినా వారు వినలేదని, తన భర్త వేధింపులు కొనసాగుతున్నట్లు రహేమా ఫిర్యాదు చేసింది. విచారణ చేయించిన సీపీ.. ఎస్సై షేక్ నాగుల్ మీరాను సస్పెండ్ చేశారు.