7 కార్పొరేషన్లలో ఏ పార్టీ పాగా వేసింది.. మేయర్, డిప్యూటీ మేయర్లు వీరే..!

7 కార్పొరేషన్లలో ఏ పార్టీ పాగా వేసింది.. మేయర్, డిప్యూటీ మేయర్లు వీరే..!

తెలంగాణ రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఆసక్తిగా సాగింది. చివరి నిమిషం వరకు ఆయా పార్టీలు మేయర్, డిప్యూటీ మేయర్ దక్కించుకోవటానికి వ్యూహ, ప్రతివ్యూహాలతో ఆసక్తిగా మారింది. ఏయే కార్పొరేషన్ ఏ పార్టీ కైవసం చేసుకున్నది.. మేయర్, డిప్యూటీ మేయర్లు ఎవరు అనేది పూర్తిగా తెలుసుకుందాం..


1. కొత్తగూడెం కార్పొరేషన్:

* కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా 20వ డివిజన్లో సీపీఐ అభ్యర్థిగా గెలుపొందిన మూడ్ గణేష్
* డిప్యూటీ మేయర్గా 8వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన సిరిపురపు లలిత కుమారి ఏకగ్రీవంగా ఎన్నిక

2. నిజామాబాద్ కార్పొరేషన్:

* నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం
* మేయర్గా  కూరగాయాల ఉమారాణి ఎన్నిక
* డిప్యూటి మేయర్గా ఎంఐఎంకి చెందిన సల్మా తహసీన్

3. మహబూబ్‌నగర్ కార్పొరేషన్:

* మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మేయర్గా మమత శ్రీనివాస్ ఎన్నిక
* మహబూబ్ నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా సురేందర్ రెడ్డి

4. కరీంనగర్ కార్పొరేషన్:

* కరీంనగర్ మేయర్ పీఠం కైవసం చేసుకున్న బీజేపీ
* కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ ఎన్నిక
* కొలగాని శ్రీనివాస్ 34 ఓట్లు.. అనూహ్యంగా ఆకుల నర్మద పేరును ప్రతిపాదించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు
* మద్దతిచ్చిన మజ్లిస్, ఏఐఎఫ్బి కార్పొరేటర్లు
* ఆకుల నర్మద 22 ఓట్లకే పరిమితం
* సభలోనే ఉంటూ తటస్థంగా వ్యవహరించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు
*డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఎన్నిక
* కాంగ్రెస్, మజ్లిస్ డిప్యూటీ మేయర్ అభ్యర్ధి హీనా అఫ్రీన్కు 22 ఓట్లు

5. రామగుండం కార్పొరేషన్:

* రామగుండం నగర పాలక సంస్థ మేయర్గా ఎన్నికైన 46వ డివిజన్  కార్పొరేటర్  మహంకాళి స్వామి
* డిప్యూటీ మేయర్గా ఎన్నికైన 57వ డివిజన్ కార్పొరేటర్ పాతిపెల్లి ఎల్లయ్య

6. నల్గొండ కార్పొరేషన్:

* నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్గా బుర్రి చైతన్య రెడ్డి (కాంగ్రెస్)
* నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 48 డివిజన్లు
* కాంగ్రెస్‌- 27, బీఆర్ఎస్ 9, బీజేపీ- 4, మజ్లిస్‌ -2, ఏఐఎఫ్‌బీ -4, ఇండిపెండెంట్లు-2 స్థానాల్లో విజయం

7. మంచిర్యాల కార్పొరేషన్:

ధర్ణి మధుకర్ (కాంగ్రెస్)