Funky Collection: ‘ఫంకీ’ బాక్సాఫీస్ షాక్.. వీకెండ్‌లో రూ.6 కోట్లలోపే వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కష్టమేనా?

Funky Collection: ‘ఫంకీ’ బాక్సాఫీస్ షాక్.. వీకెండ్‌లో రూ.6 కోట్లలోపే వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కష్టమేనా?

జాతిరత్నాలు చిత్రంతో కామెడీ జానర్‌ను కొత్తగా ప్రజెంట్ చేసిన దర్శకుడు అనుదీప్ కె.వి. ఇప్పుడు అదే స్టైల్‌ను కొనసాగిస్తూ ‘ఫంకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. ప్రమోషన్స్ పరంగా టైటిల్, పోస్టర్లు, ట్రైలర్ మంచి హైప్ తీసుకొచ్చినా, థియేటర్లలో రిలీజైన తర్వాత మాత్రం మిక్స్‌డ్ టాక్‌తో రన్ అవుతోంది.

స్టోరీ స్లోగా సాగడం, ఎమోషనల్గా కనెక్షన్ అవ్వకపోవడం, కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం వంటి అంశాలు మైనస్‌గా మారినట్లు సినీ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే, వసూళ్లు కూడా అంతఅంత మాత్రమే రాబడుతుంది. ఈ క్రమంలోనే ‘జాతిరత్నాలు’ స్థాయి విజయాన్ని ‘ఫంకీ’ అందుకోలేకపోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఫంకీ కలెక్షన్స్:

ఫంకీ సినిమాకు ఫస్ట్ డే రూ.2.29 కోట్లు నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అలానే ఓవర్సీస్‌లో మొదటిరోజు పూర్తయ్యేసరికి లక్షా 85 వేల డాలర్లు వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంటే, (ఒక కోటి 67లక్షలకు పైగా). రెండో రోజు శనివారం రూ.1.9 కోట్లు, మూడో రోజైన ఆదివారం కేవలం రూ.1.68 కోట్ల నెట్ సాధించింది. ఈ లెక్కన వీకెండ్ అయిన మూడు రోజుల్లో ఫంకీ కేవలం రూ.6 కోట్ల లోపే నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.  

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం:

ఫస్ట్ డే నెట్: రూ.2.29 కోట్లు

ఓవర్సీస్ ఫస్ట్ డే: 1.85 లక్షల డాలర్లు (సుమారు రూ.1.67 కోట్లు)

రెండో రోజు (శనివారం): రూ.1.9 కోట్లు

మూడో రోజు (ఆదివారం): రూ.1.68 కోట్లు

మొత్తంగా వీకెండ్ మూడు రోజుల్లో రూ.6 కోట్లలోపే నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

బడ్జెట్ & బ్రేక్ ఈవెన్

సినీ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ‘ఫంకీ’ సినిమా దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ప్రీ-రిలీజ్ బిజినెస్ సుమారు రూ.13 కోట్లు జరిగినట్లు సమాచారం. లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.14 కోట్ల షేర్, రూ.28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉందని ట్రేడ్ విశ్లేషణ. ప్రస్తుతం ఉన్న టాక్‌ను బట్టి చూస్తే… ‘ఫంకీ’ రాబోయే వర్కింగ్ డేస్‌లో ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.