హనుమాన్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ : షేక్ యాస్మిన్ బాష

హనుమాన్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ : షేక్ యాస్మిన్ బాష

కొండగట్టు, వెలుగు:  జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో ఈనెల 30 నుంచి జూన్ 1 వరకు జరిగే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల పోస్టర్ ను కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష సోమవారం ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయంతి ఉత్సవాలను సక్సెస్‌‌‌‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దివాకర, ఈవో చంద్రశేఖర్, ఏఈవో అంజయ్య, పాల్గొన్నారు.