చైతన్యపురి హెచ్పీ  బంక్ లో కల్తీ పెట్రోల్ 

చైతన్యపురి హెచ్పీ  బంక్ లో కల్తీ పెట్రోల్ 

హైదరాబాద్: చైతన్య పురి బస్ స్టాప్ లోని  హెచ్పీ  పెట్రోల్ బంకులో కల్తీకి పాల్పడుతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ లో నీళ్లు కలుపుతున్నారని వారు చెబుతున్నారు. బుధవారం బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్న ఓ వాహనదారుడు... బైక్ ను స్టార్ట్ చేయడానికి నానా ఇబ్బందులు పడ్డాడు. అయినా బైక్ స్టార్ట్ కాకపోవడంతో బండిలోని పెట్రోల్ ను బాటిల్ లో నింపి గమనించగా... పెట్రోల్ లో నీళ్లు కలిశాయని గుర్తించాడు. వెంటనే బంక్ సిబ్బంది, నిర్వాహకలను నిలదీశాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడ ఉన్న మిగతా వాహనదారులు అతడితి మద్దతేగా బంక్ నిర్వాహకులను నిలదీశారు. 

వందల కొద్దీ డబ్బు వెచ్చించి పెట్రోల్ కొనుగోలు చేస్తున్నామని, అయినా బంక్ నిర్వాహకులు ఇలాంటి చిల్లర వ్యాపారానికి తెగబడుతున్నారని మండిపడ్డారు. గతంలో అనేక సార్లు ఇదే బంకు సీజ్ అయిన కుడా వీరిలో మార్పు రాలేదని, యథేచ్ఛగా కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని వాహనదారులు అన్నారు. కల్తీ పెట్రోల్ విక్రయించిన యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత వాహనదారులు కోరారు.