న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రజలకు ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. 131 రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చలో భాగంగా చామల మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుతో పాటు, తెలంగాణ సీఎంపై తేజస్వి వివాదస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. హైబ్రిడ్ మోడల్ ను రేవంత్ రెడ్డి మోడల్ అంటూ మాట్లాడడం సరికాదన్నారు.
తక్షణమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎంపీ చేసిన వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలన్నారు. 2023లో మహిళా బిల్లులో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలన్నారు. కేంద్రం ఎలాంటి రాజకీయ అజెండా లేకుండా డీలిమిటేషన్, నియోజకవర్గాల పెంపును చేపట్టాలని డిమాండ్ చేశారు.

