శ్రీశైలం ప్రమాద ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి

శ్రీశైలం ప్రమాద ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి

శ్రీశైలం జ‌ల విద్యుత్ కేంద్రం ప్ర‌మాద‌ ఘటనలో మృతిచెందిన డీఈ శ్రీనివాస్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి. విద్యుత్ ప్లాంట్‌ను పరిరక్షించే క్రమంలో  ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులను  ఆదివారం కాంగ్రెస్ నాయ‌కుడు ష‌బ్బీర్ అలీతో క‌లసి ప‌రామ‌ర్శించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ .. ఈ దుర్ఘటన ప్రమాదవ శాత్తు జరగలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని విమర్శించారు. ప్రమాదం ఉందని నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.

విద్యుత్ ప్లాంట్‌ను నిర్లక్ష్యం చేసే కుట్ర జరుగుతోందని తాను ముందే చెప్పానని, సీఎండీ ప్రభాకర్‌రావు, మంత్రి జగదీష్‌రెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. సీఐడీ విచారణ పేరుతో చేతులు దులుపుకున్నారన్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని.బాధితుల కుటుంబాన్నిసీఎం కేసీఆర్ .మంత్రి కేటీఆర్ పరామర్శించిక పోవడం దారుణమ‌న్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్‌లో 500 గజాల స్థలం ఇవ్వాలన్నారు. ప్రమాద ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని  అన్నారు. పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావించే విధంగా సోనియా, రాహుల్ దృష్టికి తీసుకెళ్తామన్నారు ఎంపీ రేవంత్‌రెడ్డి.

 

MP Revanth Reddy demanded an inquiry with the CBI over Srisailam accident