తాడిచర్ల బ్లాక్ 2 కు పర్యావరణ అనుమతులు ఇవ్వండి...కేంద్ర మంత్రికి ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ రిక్వెస్ట్, ..

తాడిచర్ల బ్లాక్ 2 కు పర్యావరణ అనుమతులు ఇవ్వండి...కేంద్ర మంత్రికి ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ రిక్వెస్ట్, ..

తాడిచర్ల బ్లాక్ 2కి ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను కోరినట్లు తెలిపారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మంగళవారం ( జులై 28 ) మంత్రి వివేక్ తో కలిసి భూపేందర్ యాదవ్ ను కలిశారు ఎంపీ వంశీకృష్ణ. ఈ క్రమంలో తాడిచర్ల బ్లాక్ 2లో వెయ్యి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ అవసరమని... కేంద్ర మంత్రిని కలిసి తక్షణమే ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశామని తెలిపారు.

అంతే కాకుండా ఆర్కేపీలో కేకే మైన్ కి కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వాలని.. ఈ రెండు ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలొస్తాయని కేంద్ర మంత్రికి వివరించారు ఎంపీ వంశీకృష్ణ. గతంలో బ్లాక్  కేటాయింపు కోసం రెండేళ్లు పోరాటం చేశామని.. ఇప్పుడు ఈసీ క్లియరెన్స్ వచ్చేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఎంపీ వంశీకృష్ణ.

RKP మైన్స్‌కు కూడా పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు మంత్రి వివేక్ వెంకటస్వామి.ఈ అంశాలపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.