ఎంఎస్‌‌‌‌ఎంయూ ఆధ్వర్యంలో బోనాలు..హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి

ఎంఎస్‌‌‌‌ఎంయూ ఆధ్వర్యంలో బోనాలు..హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐఎన్ టీయూసీ అనుబంధ సంస్థ మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ (ఎంఎస్‌‌‌‌ఎంయూ) ఆధ్యర్యంలో బుధవారం జీహెచ్‌‌‌‌ఎంసీ హెడ్ ఆఫీసులో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య​అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై, అమ్మవారిని దర్శించుకున్నారు. 

ఎంఎస్‌‌‌‌ఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐఎన్‌‌‌‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిల్ షరీఫ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు కొనసాగాయి. ఐఎన్‌‌‌‌టీయూసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సంజీవరెడ్డి, మైనారిటీస్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు.