పోచంపల్లి ఇక్కత్​, నిర్మల్​ బొమ్మలకు మల్టీ మీడియా క్యాంపెయిన్

పోచంపల్లి ఇక్కత్​, నిర్మల్​ బొమ్మలకు మల్టీ మీడియా క్యాంపెయిన్

న్యూఢిల్లీ: పోచంపల్లి ఇక్కత్​, నిర్మల్​ బొమ్మలు, డార్జిలింగ్​ టీ, చందేరీ ఫ్యాబ్రిక్​, మైసూర్​ సిల్క్​, కశ్మీర్​ వాల్​నట్​ వుడ్​ కార్వింగ్స్​ వంటి  జాగ్రఫికల్​ ఇండికేషన్​ (జీఐ) ప్రొడక్టుల ప్రమోషన్​ కోసం మల్టీ మీడియా క్యాంపెయిన్​ను డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ప్రమోషన్​ ఆఫ్​ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్​ ట్రేడ్​ (డీపీఐఐటీ) ప్లాన్​ చేస్తోంది. ఇందుకోసం ఒకటి, రెండు ఆడియో విజువల్​ ఏజెన్సీలను నియమించాలని చూస్తోంది. తాజగా రిక్వెస్ట్​ ఫర్​ ప్రపోజల్​ను కూడా రిలీజ్​ చేసింది. బలమైన జీఐ ఎకో సిస్టమ్​ ఏర్పాటు కోసం అవసరమైన సాయాన్ని ఈ ఏజన్సీల నుంచి తీసుకోవాలని డీపీఐఐటీ భావిస్తోంది. పేరు పొందిన ఆడియో విజువల్​ ఏజన్సీలను ఎంపిక చేసుకోవాలని డీపీఐఐటీ ఆలోచిస్తోంది. జాగ్రఫికల్​ ఇండికేషన్​ పొందిన ప్రొడక్టులకు సంబంధించిన ఫిల్మ్స్​, డాక్యుమెంటరీలు, స్పాన్సర్డ్​ ఆడియో విజువల్​ ప్రోగ్రామ్స్​, ఏవీ స్పాట్స్​, షార్ట్​ వీడియోల కల్పన వంటి బాధ్యతలను పై ఏజెన్సీలకు అప్పచెబుతారు.

దేశంలోని జీఐ ప్రొడక్టులకు సరయిన ప్రమోషన్, ప్రచారం ​ లేకపోవడంతో ఈ చొరవ తీసుకుంటున్నట్లు డిపార్ట్​మెంట్​ వెల్లడించింది. ఇండియాలో మొత్తం 400 దాకా ప్రొడక్టులకు జీఐ గుర్తింపు ఉంది. ఈ ప్రొడక్టులకు మరింత డిమాండ్​ క్రియేట్​ అవ్వాలంటే ఎక్కువ మందికి వాటి గురించి తెలవాల్సి ఉందని డిపార్ట్​మెంట్​ పేర్కొంది. మార్కెటింగ్​, బ్రాండింగ్​, పబ్లిసిటీ క్యాంపెయిన్​, కేటలాగింగ్​ వంటి చర్యలు ఇందుకు వీలు కల్పిస్తాయని వివరించింది. ఈ–బిజినెస్​ టూల్స్​ వాడటం ద్వారా, వెబ్​పోర్టల్స్​ ఏర్పాటు చేయడం ద్వారా ప్రమోషన్​ సాధ్యపడుతుందని తెలిపింది. 

జీఐ ప్రొడక్టులకు డిమాండ్​ పెంచితే దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, ఎకానమి పుంజుకోవడమూ వీలవుతుందని డిపార్ట్​మెంట్​ వెల్లడించింది. కమ్యూనికేషన్​ మెరుగ్గా ఉంటే ప్రజలకు తొందరగా చేరువవ్వడం కుదురుతుందని, చాలా గవర్నమెంట్​ ప్రాజెక్టుల సమాచారం ప్రజలకు సమర్ధంగా చేరడం లేదని డిపార్ట్​మెంట్​ ఈ ఆర్​ఎఫ్​పీ డాక్యుమెంట్లో ప్రస్తావించింది.  ఆయా ప్రాంతాలలోని లోకల్​ ఆర్టిజన్లే జీఐ ప్రొడక్టులు తయారు చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు పనికి వచ్చేలా మల్టీమీడియా క్యాంపెయిన్​లు ఉండాలని డీపీఐఐటీ తెలిపింది. మన జీఐ ప్రొడక్టుల చుట్టూ ప్రీమియం బ్రాండ్​ క్రియేట్​ చేసేలా క్యాంపెయిన్​లు ఉండాలని భావిస్తోంది.

దేశంలోని ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రొడక్టుకు ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. అలా నిలుస్తున్న 400 జీఐ ప్రొడక్టులపైనా ఫోకస్​ పెడుతున్నట్లు డిపార్ట్​మెంట్​ వెల్లడించింది. తయారీదారులకు మద్దతుగా నిలిచే వ్యక్తులు, సంస్థలు ఎవరైనా జీఐ ప్రొడక్టు రిజిస్ట్రేషన్​ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బాస్మతి రైస్​, కుల్లు షాల్​, కంగ్ర టీ, తంజావూర్​ పెయింటింగ్స్​, అలహాబాద్​ సుర్ఖా, ఫరూఖాబాద్​ ప్రింట్స్​, లక్నో జర్దోజీ వంటి ఎన్నో జీఐ ప్రొడక్టులు దేశంలో పేరొందాయి. ఈ జీఐ ప్రొడక్టులకు ఇంటలెక్చువల్​ ప్రొపర్టీ రైట్స్​ కూడా వర్తింప చేస్తున్నారు. ఏదైనా ప్రొడక్టుకు జీఐ గుర్తింపు ట్యాగ్​ ఇస్తే ఆ ప్రొడక్టును ఇతర వ్యక్తులు, కంపెనీలు దానిని పోలిన ప్రొడక్టులను, బ్రాండ్​ను వాడటానికి వీలుండదు.  ఈ జీఐ ట్యాగ్​కు  పదేళ్ల వ్యాలిడిటీ ఉంటోంది. ఎగుమతుల ప్రమోషన్​లోనూ జీఐ ప్రొడక్టులకు పెద్ద పీట వేస్తున్నారు.