రోడ్డుపై అసభ్యకరమైన స్టంట్.. చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్స్ ఫైర్

రోడ్డుపై అసభ్యకరమైన స్టంట్.. చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్స్ ఫైర్

ముంబైకి చెందిన ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. నిత్యం రద్దీగా ఉండే ముంబై వీధుల్లో ఒక జంట అసాధారణమైన స్కూటర్ రైడ్‌కు సంబంధించిన ఈ వీడియోలో.. బాంద్రా రిక్లమేషన్ రోడ్‌లో కదులుతున్న వాహనంలో ఈ జంట బహిరంగంగా తమ ప్రేమను ప్రదర్శించారు. ఈ వైరల్ క్లిప్ లో రోడ్డుపై తమ స్కూటర్‌పై వెళుతున్నప్పుడు జంట గట్టిగా కౌగిలించుకున్నారు. వీడియోలో ఆమె తన పార్ట్నర్ ఒడిలో రివర్స్ పొజిషన్‌లో కూర్చొని, తనను, ఆ వ్యక్తిని శాలువుతో కప్పుకున్నట్లు చూపిస్తుంది. క్లిప్ ప్రకారం, తోటి ప్రయాణీకుడు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇలా అసభ్యకరంగా బైక్ పై రైడింగ్ చేస్తూ కనిపించడమే కాకుండా.. వారు హైవేపై హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతున్నట్లు నెటిజన్లు గుర్తించారు.

ఆన్‌లైన్‌లో షేర్ కావడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఈ క్లిప్ సోషల్ మీడియా యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియోకు ముంబై పోలీసులను ట్యాగ్ చేసి, వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. అతని బైక్ నంబర్‌ను ఫైల్ చేసి, అతన్ని పోలీసులకు ఫిర్యాదు చేయండని, ట్రాఫిక్ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని, ట్రాఫిక్ రూల్స్ లేదా హ్యుమానిటీ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా వారి నుండి ఫిర్యాదులను పరిగణించే ఏదైనా యాప్ ఉంటే.. దాని గురించి తమకు తెలియజేయండని ఇంకొందరు కామెంట్ చేశారు.