ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకే ప్రచారం..

ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకే ప్రచారం..

పోలింగ్ కు 48 గంటల ముందు సభలు, సమావేశాలు పెట్టొద్దు
సోషల్‌ మీడియాలోనూ క్యాంపెయిన్‌ చేయొద్దు
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..క్యాండిడేట్లు, పార్టీలకు ఈసీ వార్నింగ్

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం యంత్రంతో ముగించాలని రాష్ట్ర ఎన్ని కల సంఘం తెలిపింది. పోలింగ్ 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారం చేయరాదని పేర్కొంది. కరీం నగర్‌ మినహా అన్ని మున్సిపాలిటీలు, కార్పొ రేషన్లలో సాయంత్రం5 గంటల వరకు మాత్ర మే ప్రచారం చేసుకోవాలని స్పష్టం చేసింది. కరీంనగర్‌ కార్పొరేషన్ లో 22వ తేదీ సాయంత్రం వరకూ అవకాశం ఉంటుం దని పేర్కొంది. సాయంత్రం 5 గంటల తర్వాత బహిరంగ సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించవద్దని, అందులో పాల్గొనవద్దని తెలిపింది.

టీవీలు, సినిమాటోగ్రఫీ పద్ధతిలో ఎన్నికల ప్రచారం చేయొద్దని సూచించింది. నిబంధనలు ఉల్లం ఘిస్తే తెలంగాణ మున్సిపాలిటీ చట్టం –2019, జీహెచ్‌ఎంసీ యాక్ట్‌–1955 ప్రకారం రెండేళ్లు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారని, కొన్ని సందర్భాల్లో రెండూ అమలు చేస్తారని హెచ్చరించింది. సోషల్‌ మీడియాలో ప్రచారం చేసినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పింది. క్యాండిడేట్లు, రాజకీయ పార్టీలు, ప్రచార నిర్వాహకులు, మీడియా ఇన్ చార్జ్ లు దీన్ని గమనించి, కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

see also: ఆరేళ్ల TRS పాలనలో బతుకులు మారలేదు