శామీర్పేట, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుత, గత పాలకుల పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని జనసేన పార్టీ రాష్ట్ర ఇన్చార్జీ నేమురి శంకర్ గౌడ్ అన్నారు. జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీల్లో 8 మంది అభ్యర్థులకు సోమవారం తుర్కపల్లిలో ఆయన బీ ఫారాలు అందజేశారు. జనసేన అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని, ఆయా వార్డుల అభివృద్ధికి పవన్ కల్యాన్తో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
