కష్టపడితే అన్ని సాధ్యమే.. దానికి నేనే నిదర్శం : మల్లారెడ్డి

కష్టపడితే అన్ని సాధ్యమే.. దానికి నేనే నిదర్శం : మల్లారెడ్డి

హైదరాబాద్ : ఐదు సంవత్సరాలల్లో TS-ఐపాస్ సక్సెస్ కావడం చాలా సంతోసంగా ఉందన్నారు మంత్రి మల్లారెడ్డి. TS-ఐపాస్ 5 సంవత్సరాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన మల్లారెడ్డి.. ఇందుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే కేటీఆర్ పై ప్రశంసలు గుప్పించిన మల్లారెడ్డి..తన గురించి కూడా చెప్పుకొచ్చారు. తాను చిన్నప్పుడు సైకిల్ మీద పాలు సరఫరా చేశానని..ఇప్పుడు మినిస్టర్ అయ్యానని తెలిపారు.

పాల వ్యాపారంతో ప్రారంభమైన తన సక్సెస్ మల్లారెడ్డి విద్యా సంస్థల వరకు వచ్చానంటే అందుకు నిదర్శనం కష్టం అన్నారు. కష్టపడితే సాధించలేనిది ఏది లేదనడానికి తానే ఆదర్శం అని తెలిపారు. అందరం కలిసి పని చేసి దేశంలోనే తెలంగాణను నంబర్-1 స్థానానికి తేవాలన్నారు. తెలుగువారికి తెలివి ఎక్కువని యువత కసిగా లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ అని ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలంటూ చెప్పుకొచ్చారు మంత్రి మల్లారెడ్డి.