- కేసీఆర్ బాటలోనే రేవంత్ పయనిస్తున్నారు
- ‘సేవ్ తెలంగాణ.. ఓట్ బీజేపీ’ పేరుతో చార్జిషీట్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘40 పర్సెంట్’ కమీషన్ల దందాకు తెరలేపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన రూ. 2,500 కోట్లను అభివృద్ధికి వాడకుండా దారి మళ్లించిందని, ఆ పైసలన్నీ ఎటు పోయినయో ఎవరికీ తెల్వదని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో ‘సేవ్ తెలంగాణ.. ఓట్ బీజేపీ’ పేరుతో మున్సిపల్ ఎన్నికల చార్జ్‌షీట్‌ను మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఇన్‌చార్జి ఆశిష్ షెలార్‌తో కలిసి రాంచందర్‌రావు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల జెండాలు వేరైనా.. వాటి ఎజెండా ఒక్కటేనని చెప్పారు. ఆ రెండు పార్టీలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మా, బొరుసు లాంటివని, గత పదేండ్లు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఆగంజేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నదని అన్నారు. అవినీతి, ఫోన్ ట్యాపింగ్, పాలనా వైఫల్యాల్లో గత కేసీఆర్ సర్కారును రేవంత్‌రెడ్డి సర్కారు మించిపోయిందని విమర్శించారు.
బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. మీడియాలో బీజేపీకి స్పేస్ రాకుండా ఈ రెండు పార్టీలు పక్కా ప్లాన్ చేస్తున్నాయని అన్నారు. ‘‘బీఆర్ఎస్ వాళ్లు అందరి ఫోన్లు ట్యాప్ చేశారు.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా ట్యాపింగ్ చేస్తున్నదనే అనుమానం మాకుంది. ఫోన్ ట్యాపింగ్‌లో, అవినీతిలో ఈ రెండు పార్టీలు దొందూ దొందే’ అని వ్యాఖ్యానించారు.
కేంద్ర నిధుల కోసమే ఎన్నికలు
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని రామచందర్‌రావు ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసమే ఎన్నికలు పెడుతున్నారని విమర్శించారు. జీతాలు లేక, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక 40 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయినా సర్కారుకు సోయిలేదని అన్నారు. కామారెడ్డి, వరంగల్ డిక్లరేషన్ల పేరుతో గ్యారెంటీలు ఇచ్చి జనాన్ని మోసం చేశారని, ‘నిరుద్యోగ భృతి ఏమైంది?.. ఇందిరమ్మ ఇండ్లు ఎవరికిచ్చిన్రు?’ అని అడిగారు.
ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి.. నయా పైసా ఇవ్వలేదన్నారు. బీజేపీకి అభివృద్ధి ఒక్కటే ఎజెండా అని, బడ్జెట్ చూస్తే ఆ విషయం అర్థమవుతుందని ఆశిష్ షెలార్ వ్యాఖ్యానించారు. అనంతరం మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లతో కూడిన ప్రచార రథాలను బీజేపీ స్టేట్ ఆఫీసులో రాంచందర్ రావు జెండా ఊపి ప్రారంభించారు.
‘రెబల్’గా పోటీచేస్తే.. 15 ఏండ్లు సస్పెండే
మున్సిపల్ ఎలక్షన్లలో పార్టీ మాట కాదని రెబల్‌గా పోటీ చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పష్టం చేశారు. బీ ఫామ్ ఇచ్చినోళ్లకే అందరూ సహకరించాలని, మిగతా ఆశావహులు వెంట నే నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని ఆదేశిం చారు. లేదంటే 15 ఏండ్ల పాటు సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. సోమవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 15 ఏండ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని, భవిష్యత్ లో వాళ్లను మళ్లీ బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని వివరించారు.
పార్టీ కోసం పనిచే సే కార్యకర్తలే బలమని, పంచాయతీ ఎలక్షన్ల లెక్కనే మున్సిపల్ పోరులోనూ సత్తా చాటాల ని పిలుపునిచ్చారు. సర్వే రిపోర్టులు, సామాజిక సమీకరణాల ఆధారంగా టికెట్లు ఖరారు చేసిన ట్లు వివరించారు. టికెట్ రాని లీడర్లు బాధపడ డం సహజమే అయినా.. పార్టీ కోసం కాంప్రమై జ్ కావాలని సూచించారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ఏపాటు చేసిన కార్యక్రమంలోనూ రాంచందర్ రావు పాల్గొని మాట్లాడారు.
