నాగచైతన్య ‘కస్టడీ’ ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్

నాగచైతన్య ‘కస్టడీ’ ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్

నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కస్టడీ’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్‌‌గా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తోంది. నాగచైతన్య పోలీస్‌‌ ఆఫీసర్‌‌‌‌గా నటిస్తున్న ఈ మూవీ నుండి ‘హెడ్ అప్‌‌ హై’ అనే సాంగ్‌‌ను విడుదల చేశారు.

ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కంపోజ్‌‌ చేశారు. ‘సేఫ్టీ, సెక్యూరిటీకి సింబల్‌‌ ఈ ఖాకీరా, మఫ్టీలో ఉన్నా.. మన పవరే పటాకీ, డ్యూటీలో రౌండ్‌‌ ద క్లాక్‌‌ ఫుల్‌‌ చలాకీరా, ఈ లాఠీతో జర్నీ చేసే లైఫ్‌‌ ఎంతో లక్కీరా’ అంటూ పోలీసుల గురించి ఈ పాటలో రాశారు రామజోగయ్య శాస్త్రి. యువన్ శంకర్ రాజా, అరుణ్ కౌండిన్య, అసల్ కోలర్ పాడారు. పోలీస్ స్టేషన్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో నాగచైతన్యపై చిత్రీకరించిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.

సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మే 12న సినిమా విడుదల కానుంది.