
‘ఛలో’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నా.. ఆ తర్వాత వరుస పరాజయాలతో నాగశౌర్య కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. దాంతో సొంత ప్రొడక్షన్‌లోనే ఒక కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకి ‘అశ్వత్థామ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కాక ‘ఊహలు గుసగుసలాడె’తో తనకు సక్సెస్‌నిచ్చిన శ్రీనివాస అవసరాలతో ఒక మూవీ కమిటయ్యాడు. ఇప్పుడు మరొక కొత్త సినిమాకి ఎస్ చెప్పాడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమాతో లక్ష్మి సౌజన్య అనే కొత్త దర్శకురాలు పరిచయమవుతోంది. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభించి, వచ్చే మే నెలలో రిలీజ్ చేయనున్నారు. రీసెంట్‌గా ఇటీవలే నందినీరెడ్డి తెరకెక్కించిన ‘ఓ బేబి’లో కనిపించిన నాగశౌర్య, మరో లేడీ డైరెక్టర్‌తో పని చేయడానికి రెడీ అవ్వడం విశేషం.