నాగార్జున హీరోగా ‘వైల్డ్ డాగ్’

నాగార్జున హీరోగా ‘వైల్డ్ డాగ్’

‘మన్మథుడు’ సీక్వెల్ నిరాశపర్చడంతో ఈసారి నాగార్జు న ఏ సినిమాతో వస్తారోనని ఎదురు చూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఆ ఎదురు చూపులకు తగ్గట్టు గానే చాలా డిఫరెంట్ గా వచ్చేలా కనిపిస్తున్నారాయన. నాగార్జున హీరోగా ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు డైరెక్టర్ అహిషోర్ సాల్మన్. ఈ మూవీ ఫస్ట్‌ లుక్ శుక్రవారం విడుదలయ్యిం ది. నాగ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ​లాగా కనిపించడంతో ఆసక్తి రేగుతోంది. ఆయన ఎన్‌ఐఎ ఏజెంట్ గా నటిస్తున్నట్లు పేపర్‌‌ రిపోర్ట్ ఆధారంగా అర్థమవుతోంది. పత్రికలో రాసివున్న వార్తను బట్టి సినిమా మెయిన్‌ లైన్ ఏంటనేది తెలుస్తోంది. మొత్తంగా ఆయన లుక్ ను అత్యంత ఆసక్తికరంగా మలిచారు. ఇందులో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ వర్మగా నాగ్ నటిస్తున్నారు. ఆయన్ని పోలీస్ శాఖ లో అంతా  వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. ఆ క్యాడర్ లో ఆయన ఏ ఆపరేషన్స్‌ చేపడతారనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిం దే. నిజ ఘటనల ఆధారంగా నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సీరియస్‌ రోల్ నాగ్ కి ఎలాం టి రిజల్ట్ ఇస్తుం దో మరి.

Nagarjuna as ACP Vijay Varma in Wild Dog