ప్రభుత్వ విప్ గా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ప్రభుత్వ విప్ గా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ, వెలుగు: ప్రభుత్వ విప్ గా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నల్గొండ జిల్లాకు మరో మంత్రి హోదా దక్కింది.  నకిరేకల్​ ఎమ్మెల్యే వేముల వీరేశానికి మాదిగ సామాజిక వర్గం కోటాలో ప్రభు త్వ విప్​ గా క్యాబినెట్ పదవిని దక్కించుకున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియార్టీ వీరేశానికి కలిసొచ్చింది.

రాష్ట్రంలో మాదిగ సామాజికవర్గం నుంచి వీరేశానికి ప్రయార్టీ ఇస్తే నల్గొండ  కాంగ్రెస్​లో పార్టీకి మైలేజ్​ పెరుగుతుందని భావించిన హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. మందుల సామేలు సైతం ఒక్కటే  సామాజికవర్గం అయినప్పటికీ వీరేశం మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా రెండు సార్లు గెలిచారు.