నల్గొండ, వెలుగు: జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గురువారం గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1442 లేదా వాట్సాప్ నంబర్ 6305951279 కు సంప్రదించాలని కలెక్టర్ కోరారు.
