ఓటేయడం ఓ అనుభూతి : నందమూరి బాలకృష్ణ

ఓటేయడం ఓ అనుభూతి : నందమూరి బాలకృష్ణ

అనంతపురం : సినీ నటుడు, హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓటేశారు. తన భార్య వసుంధరతో కలిసి అనంతపురం పట్టణం ఎంపీడీవో కార్యాలయం… బూత్ నంబర్ 42లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆకాంక్షించారు నందమూరి బాలకృష్ణ. సొంత నియోజకవర్గంలో ఓటు వేసినంత అనుభూతి కలిగిందని అన్నారు. అభివృద్ధి సంక్షేమం చూసి నాయకులను ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.