నాని ‘దసరా’ నుంచి ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్

నాని ‘దసరా’ నుంచి ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా అలరించనుంది. ఇవాళ (ఆదివారం) ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు తెలుపుతూ.. ధూం ధాం దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం.. అంటూ ట్విట్టర్ వేదికగా ఒ పోస్టర్ ను వదిలారు. నానీ, సింగరేణి బొగ్గుగనుల్లో పనిచేస్తున్న అతడి గ్యాంగ్ ఈ పోస్టర్‌లో చూడవచ్చు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో వెరైటీ ప్రేమ కథాచిత్రంగా రూపొందుతోంది. ఇందులో సముద్రఖని, పూర్ణ, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రోషన్ మ్యాథ్యూ, సాయికుమార్, జరీనా వవాబ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.