తలసేమియా బాధితులను ఆదుకోవాలి : ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువ నేశ్వరి

తలసేమియా బాధితులను ఆదుకోవాలి :  ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువ నేశ్వరి
  •     ఎన్టీఆర్​ ట్రస్ట్​ చైర్​పర్సన్​ నారా భువనేశ్వరి

ట్యాంక్ బండ్, వెలుగు: తలసేమియా బాధిత చిన్నారులకు రక్తదానం చేసేందుకు ప్రతీఒక్కరు ముందుకు రావాలని ఎన్టీఆర్​ ట్రస్ట్​ చైర్​పర్సన్​ నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్ రోడ్ జలవిహార్ వద్ద తలసేమియా రన్ నిర్వహించారు. 

3కే, 5కే, 10కే రన్‌‌‌‌‌‌‌‌ను సిటీ సీపీ సజ్జనార్​, మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి భువనేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు బాధితులకు మద్దతుగా నిలిచేందుకు ఈ రన్ నిర్వహించినట్లు తెలిపారు.