V6 News

తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి లోకేష్. బుధవారం ( ఏప్రిల్ 15 ) తిరుపతిలో పర్యటించిన లోకేష్ తిరుపతిలోని గొల్లవాని గుంటలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ స్టేడియం క్రికెట్ పెవిలియన్ స్పోర్ట్స్ కంప్లెక్స్, అకాడమీలను ప్రారంభించారు. శాప్, తుడా సహకారంతో రూ.10.10 కోట్ల నిధులు వెచ్చించి ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మించారు. ముందుగా క్రీడా ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. 

అనంతరం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీ బాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ అకాడమీలను ప్రారంభించారు లోకేష్. స్పోర్ట్స్ కంప్లెక్స్ మొత్తం కలియదిరిగిన లోకేష్ క్రికెట్, కబడ్డీ, కోకో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ క్రీడాకారులతో గ్రూప్ ఫోటో దిగారు. కొద్దిసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు లోకేష్. అనంతరం ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంతో పాటు ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ ను ప్రారంభించారు. 

భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాల్ రాజ్, ఇతర క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు క్రికెడ్ ఆడారు లోకేష్. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో సంభాషించారు. క్రీడా ప్రాంగణంలో ప్రణీత్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.