RTC విలీనంపై కేసీఆర్ మాట్లాడిన వీడియో నా దగ్గరుంది: నారాయణ

RTC విలీనంపై కేసీఆర్ మాట్లాడిన వీడియో నా దగ్గరుంది: నారాయణ

కేసీఆర్ ముక్కు కోసుకునేందుకు సిద్ధమా

సీపీఐ నారాయణ సవాల్

ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతోందని.. అందుకోసమే తమ పార్టీ టీఆర్ఎస్ కు ప్రకటించిన మద్దతును ఉపసంహరణ చేసుకుందని వీ6తో చెప్పారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఆర్టీసీని ప్రభుత్వంలో  విలీనం చేస్తాను అని కేసీఆర్ మాట ఇచ్చారనీ… దానిని తాను నిరూపిస్తా అని సవాల్ చేశారు. ఒకవేళ విలీనం అనలేదు అని కేసీఆర్ నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా అని అన్నారు. విలీనంపై కేసీఆర్ మాట్లాడిన వీడియో నా దగ్గర ఉంది అది నేను చూపిస్తా… విలీనంపై కేసీఆర్ మాట్లాడింది నిజం అయితే కేసీఆర్ ముక్కు కోసుకుంటాడా.. అని సవాల్ విసిరారు నారాయణ.

నిజాం మెడలు వంచిన తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మెడలు వంచుడు పెద్ద లెక్క ఏమి కాదన్నారు నారాయణ. “రాజకీయ పార్టీలు సమ్మె చేయాలని చెప్పవు.. సమ్మె చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపితే మేము వారి తరపున ఉద్యమం చేస్తాం. కేశవరావు మేక లింగం ఉన్న వ్యక్తి. అయిన తోటి ఏమి ఐతది. కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేయాలి” అన్నారు.