తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీకి లేఖ రాశారు మాజీ మంత్రి చిన్నారెడ్డి. తాను ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. తప్పుగా మాట్లాడలేదని లేఖలో పేర్కొన్నారు చిన్నారెడ్డి. 1978 నుండి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నానని, పార్టీ కి బద్ధునిగా పని చేస్తున్నానని అన్నారు.
తాను ఏ రోజు పార్టీ కి వెతిరేకంగా మాట్లాడలేదని.. ఇందిరభవన్ , గాంధీ భవన్ లను దేవాలయంలా బావిస్తానని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వ్యవహారం ఒంటెద్దుపోకడలా ఉందని అన్నారు.
ALSO READ : 50 గజాల్లో ఏడంతస్తులు బిల్డింగ్ కట్టిర్రు
తనకు ఇచ్చిన నోటీసు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు చిన్నారెడ్డి. తన వివరణను పరిగణనలోకి తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల తన విధేయతపై ఎలాంటి సందేహాలు వద్దని... పార్టీ కార్యకర్తల మనోభావాలకే తాను వాణిగా నిలిచానని లేఖలో పేర్కొన్నారు చిన్నారెడ్డి.
