ప్రభుత్వం కీలక హెచ్చరిక.. నాలుగేళ్ల లోపు పిల్లలకు ఈ మందులు వాడొద్దు

ప్రభుత్వం కీలక హెచ్చరిక.. నాలుగేళ్ల లోపు పిల్లలకు ఈ మందులు వాడొద్దు

చిన్నారులకు వాడే మందులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్లోర్ ఫెనిరమైన్ మలేట్ అండ్ ఫినైల్ఫైన్ హైడ్రోక్లోరైడ్ కలిగిన అన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ల తయారీ, అమ్మకం, పంపిణీపై ఆంక్షలు విధించింది. అంతేకాదు.. ఈ మందులను నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు వాడొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ ప్రకటనలో.. ఈ ఫార్ములేషన్లకు సంబంధించిన లేబుల్, ప్యాకేజీ ఇన్సర్ట్, ప్రచార ప్రకటనలపై, “నాలుగేళ్ల లోపు పిల్లలకు క్లోర్ ఫెనిరమైన్ మలేట్ అండ్ ఫినైల్ఫైన్ హైడ్రోక్లోరైడ్ ఫిక్డ్స్ డోస్ కాంబినేషన్ ఉపయోగించరాదు” అనే హెచ్చరిక స్పష్టంగా ఉండాలని ప్రభుత్వం ఈ కాంబినేషన్ మెడిసిన్ తయారుచేసే ఫార్మా సంస్థలను ఆదేశించింది.

ఇటువంటి కాంబినేషన్ మందులు నాలుగేళ్ల లోపు పిల్లలకు వాడటం ప్రమాదమని, వీటికి బదులుగా సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026 జూన్‌లో.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 16 ఫిక్స్‌డ్-డోస్ కాంబినేషన్ (FDC) మందుల తయారీ, అమ్మకం, పంపిణీని నిషేధించిన సంగతి తెలిసిందే. నిపుణుల కమిటీ, ఔషధ సాంకేతిక సలహా మండలి సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది.

ALSO READ : KPHBలో CDM దగ్గర రిటైర్డ్ టీచర్‌ ను మోసం చేసి...

దేశీయంగా లభించే 16 రకాల ఫిక్స్డ్ -డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాల (రెండు లేదా అంతకంటే ఎక్కువ మందుల మిశ్రమం) పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ కాంబినేషన్ల వాడకానికి ఎటువంటి వైద్యపరమైన సైంటిఫిక్ ఆధారాలు లేవని, వీటితో ప్రయోజనం కంటే రిస్క్ ఎక్కువని నిపుణుల కమిటీ తేల్చడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 లోని సెక్షన్ 26ఏ కింద ఈ నిషేధాన్ని విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

నిషేధించిన ముఖ్యమైన మందులు
యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు: అమోక్సిసిలిన్ + సెరాటియోపెప్టిడేస్ మిశ్రమం, అమోక్సిసిలిన్ + క్లోక్సాసిలిన్; పారాసిటమాల్ + లిగ్నోకైన్; డైసైక్లోమైన్ + పారాసిటమాల్ + క్లిడినియం బ్రోమైడ్ వంటి కాంబినేషన్లు.