
హైదరాబాద్, వెలుగు: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జులై 5 నుంచి జులై 14 వరకు నిర్వహించిన ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ లో నారాయణ స్టూడెంట్ సత్తా చాటాడు. విద్యా సంస్థలకు చెందిన కుచ్చి సందీప్ గోల్డ్ మెడల్ సాధించి విజయఢంకా మోగించాడు. ఒలింపియాడ్ పోటీదారుల నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్నప్పటికి సందీప్ ప్రజ్ఞ ప్రదర్శించి గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థల అధ్యాపకుల ప్రోత్సాహం, నిరంతర మద్దతుతోనే ఈ విజయం సాధ్యమైందని తెలిపాడు.
అనంతరం నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ సింధూర నారాయణ మాట్లాడారు. సందీప్ సాధించిన విజయంతో తమ సంస్థ ఎంతగానో గర్విస్తుందని పేర్కొన్నారు. ఇది అతడి వ్యక్తిగత విజయం మాత్రమే కాదని.. నారాయణ కుటుంబంతో పాటు దేశం గర్వపడే క్షణమని వివరించారు.