భూమాతను కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి

భూమాతను కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి
  • అదొక్కటే మార్గం: ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: దేశ రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలని ప్రధాని మోడీ కోరారు. భూమాతను కాపాడుకోవడానికి అదొక్కటే మార్గమన్నారు. పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు మోడీ. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని మోడీ చెప్పారు. దేశ రైతులు రసాయనాలు లేని వ్యవసాయం వెపు మళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. భూమి మొత్తం బంజరుగా మారకుండా ఉండాలంటే... ఆర్గానిక్ వ్యవసాయ ఉత్తమమన్నారు. 2022లో కొత్త సవాళ్లను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. దీనికోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ఉపయోగించుకోవాలన్నారు. పంటల అవశేషాలు, వ్యర్థాల నుంచి రైతులకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. 
దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి 8శాతానికి పైగా ఉందని మోడీ చెప్పారు. రికార్డ్ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. GST కలెక్షన్లలో పాత రికార్డులు చెరిగిపోయాయన్నారు. 2021 లో UPI ద్వారా 70 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగాయన్నారు. దేశంలో 50వేలకు పైగా స్టార్టప్స్ పనిచేస్తున్నాయన్నారు మోడీ. పూర్తి జాగ్రత్తతో ప్రభుత్వం కరోనాపై పోరాడుతోందన్నారు మోడీ. కరోనా అనేక సవాళ్లను విసురుతున్నప్పటికీ... భారత వేగాన్ని ఆపలేదన్నారు. 
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం విడుదల చేశారు ప్రధానమమంత్రి నరేంద్ర మోడీ. పథకం 10వ ఇన్ స్టాల్ మెంట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు మోడీ. ఈ ఆర్థిక సంవత్సరంలో రైతుల అకౌంట్లలోకి 65వేల 800 కోట్లు ట్రాన్స్ ఫర్ చేసినట్టు మోడీ చెప్పారు. పీఎం కిసాన్ స్కీమ్ కింద మొత్తం లక్షా 8వేల కోట్లు రైతులకు అందించామన్నారు. ఇదే కార్యక్రమంలో 351 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లకు 14 కోట్ల రూపాయలకు పైగా ఈక్విటీ గ్రాంట్ ను మోడీ విడుదల చేశారు. దీనివల్ల లక్షా 24వేల మంది రైతులకు లబ్ధి జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.