నవీన్ పొలిశెట్టి జోరు..ఒకే రోజు రెండు సినిమాలు అనౌన్స్

నవీన్ పొలిశెట్టి జోరు..ఒకే రోజు రెండు సినిమాలు అనౌన్స్

జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు.  జాతిరత్నాలు హిట్ తర్వాత తన తర్వాతి సినిమా ఏంటనేది ఇంత వరకు క్లారిటీ రాలేదు..ఈ రోజు తన బర్త్ డే సందర్భంగా  ఏకంగా రెండు కొత్త సినిమాల డీటేల్స్ ను ప్రకటించారు నిర్మాతలు.  ఇందులో ఒకటి. నవీన్ పొలిశెట్టి యువీ క్రియేషన్ బ్యానర్ లో ఓ  సినిమా చేయనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో అనుష్క నటించనుంది. ఈ విషయాన్ని యువీ క్రియేషన్ తన ట్విట్టర్లో ప్రకటించింది. యువీక్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 14 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు పి.మహేశ్ బాబు డైరెక్షన్ చేయనున్నారు. రెండోది  ప్రముఖ సితారా ఎంటర్ టైన్ మెంట్స్  బ్యానర్ లో నవీన్ పొలిశెట్టి మరో సినిమా చేయనున్నాడు.కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో నవీన్ లుక్ ను రిలీజ్ చేశారు.