అయ్యో పాపం : సిద్ధూ భార్య ఎలా అయిపోయింది..

అయ్యో పాపం : సిద్ధూ భార్య ఎలా అయిపోయింది..

భారత మాజీ క్రికెట‌ర్‌, కాంగ్రెస్ నేత న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu) భార్య న‌వ‌జ్యోత్ కౌర్ క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశారు.

ఈ ఏడాది మార్చి నెలలో న‌వ‌జ్యోత్ కౌర్ క్యాన్సర్  బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. స్టేజ్ 2 ఇన్వేసివ్ క్యాన్సర్‌ను గుర్తించిన వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు. ఆ గాయాలు మానాయ‌ని, కానీ మాన‌సిక‌మ‌న మ‌ర‌క‌లు ఉండిపోయాన‌ని, ప్ర‌స్తుతం ఫిఫ్త్ కీమో జ‌రుగుతోంద‌ని సిద్దూ తన ట్విట్టర్ పోస్టులో తెలిపారు. 

చేయి క‌దిపేందుకు ఇబ్బందిప‌డుతున్న త‌న భార్య‌కు సిద్దూ స్పూన్‌తో అన్నం తినిపిస్తున్నారు. అన్నీ తానై దగ్గరుండి సేవలు చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకునేందుకు మ‌నాలీ తీసుకువెళ్ల‌నున్న‌ట్లు తెలిపారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.