డ్రోన్ దాడిపై నేవీ దర్యాప్తు షురూ!

డ్రోన్ దాడిపై  నేవీ దర్యాప్తు షురూ!

న్యూఢిల్లీ: ఇండియా వెస్ట్ కోస్ట్‌‌లో కార్గో షిప్‌‌పై జరిగిన డ్రోన్ అటాక్‌‌పై నేవీ దర్యాప్తు షురూ చేసింది. దాడి ఘటన గురించి తెలిసిన వెంటనే ఒక వార్‌‌‌‌షిప్‌‌, మారీటైమ్ పెట్రోల్ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌ను మోహరించి నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగాయని అధికారులు వెల్లడించారు. దాడికి గురైన ‘ఎంవీ చెమ్ ప్లూటో’ నౌక ముంబైకి వస్తున్నదని, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ‘ఐసీజీఎస్ విక్రమ్’ రక్షణ కల్పిస్తున్నదని చెప్పారు.

 డ్రోన్ దాడి ఎక్కడి నుంచి జరిగిందనే దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు వివరించారు. అటాక్‌‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ‘ఐఎన్ఎస్ మొర్ముగావ్‌‌’ను లొకేషన్‌‌కు పంపినట్లు వెల్లడించారు. సౌదీ ఆరేబియాలోని అల్ జుబైల్ పోర్టు నుంని న్యూ మంగళూరు పోర్టుకు క్రూడ్ ఆయిల్‌‌తో నౌక బయల్దేరింది. అయితే పోరుబందర్‌‌‌‌కు 217 నాటికల్ మైళ్ల దూరంలో డ్రోన్ దాడికి గురైంది.