లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్ ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు ఆయనను లండన్ తీసుకెళ్లాలని సూచించారు. ట్రీట్‌మెంట్ కోసం ఆదివారం ఉదయం లండన్ వెళ్లాల్సిన షరీఫ్ ప్రయాణం రద్దయింది. నో ఫ్లై లిస్ట్‌లో షరీఫ్ పేరు ఉండడం వల్ల వెళ్లలేకపోయామని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అధికార ప్రతినిధి చెప్పారు. “ నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో అధికారి అందుబాటులో లేరు అందుకే షరీఫ్ పేరును లిస్ట్ నుంచి తొలగించలేం. మెడికల్ రిపోర్ట్స్‌ను పరిశీలించాక లిస్ట్‌లో నుంచి పేరు తొలగింపుపై నిర్ణయం తీసుకుంటారు” అని అధికారులు చెప్పారు.

