రూపాయి విలువ పతనం కావడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం

రూపాయి విలువ పతనం కావడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం

అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి ఎందుకు పడిపోయిందో వివరణ ఇవ్వాలని శరద్ పవార్ నేతృత్వంలోని  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిమాండ్ చేసింది. రూపాయి విలువ పతనం కావడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించింది. మిగ‌తా దేశాల క‌రెన్సీల‌తో పోల్చితే అమెరిక‌న్ డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ త్వర‌లోనే మెరుగుప‌డుతుంద‌ని నిర్మలా సీతారామ‌న్ చెప్పిన మరుసటిరోజే ట్రేడింగ్‌లోనే రూపాయి భారీగా ప‌త‌నం కావ‌డంతో ఎన్సీపీ ఆమెను  ప్రశ్నించింది. 

భార‌త క‌రెన్సీ రూపాయి విలువ రోజురోజుకు దారుణంగా ప‌త‌న‌మ‌వుతున్నది. సోమ‌వారం నాటి ఎర్లీ ట్రేడింగ్‌లో అమెరిక‌న్ డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి విలువ‌ 43 పైస‌లు ప‌త‌న‌మై రూ.81.52కు చేరింది. ఎర్లీ ట్రేడింగ్‌లో రూపాయి అత్యంత బ‌ల‌హీనంగా రూ.81.52 వ‌ద్ద ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత రికార్డు స్థాయిలో రూ.81.55 పైస‌ల‌కు ప‌డిపోయింది. త‌ర్వాత పుంజుకుని రూ.81.52 వ‌ద్ద కొన‌సాగుతున్నది.