ఐటీ రిటర్న్​లు 5.89 కోట్లు

ఐటీ రిటర్న్​లు 5.89 కోట్లు

న్యూఢిల్లీ: 2020–-21 ఆర్థిక సంవత్సరానికి (మార్చి 2021తో ముగింపు) దాదాపు 5.89 కోట్ల ఐటీఆర్​లు (ఆదాయపు పన్ను రిటర్న్‌‌‌‌‌‌‌‌లు) కొత్త ఈ–-ఫైలింగ్ పోర్టల్‌‌‌‌లో దాఖలయ్యాయని ఐటీ శాఖ శనివారం తెలిపింది.  శుక్రవారం.. అంటే డిసెంబర్ 31వ తేదీనే 46.11 లక్షలకు పైగా ఐటీఆర్‌‌‌‌లు అప్​లోడ్​ అయ్యాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది.  జనవరి 10, 2021 నాటికి, (అసెస్​మెంట్​ ఇయర్​ 2020-–21), దాఖలు చేసిన మొత్తం ఐటీఆర్​ సంఖ్య 5.95 కోట్లని వెల్లడించింది.  అసెస్మెంట్ ఇయర్ 2021-–22  కోసం 5.89 కోట్ల ఐటీఆర్‌‌‌‌లు అప్​లోడ్​ అయ్యాయి.   ఐటీఆర్ ఫామ్– 1 (సహజ్)   ఐటీఆర్ ఫామ్ 4 (సుగమ్)..  చిన్న,   మధ్యస్థ పన్ను చెల్లింపుదారులకు ఇస్తారు. రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉండి,   జీతం, ఇల్లు/ ఆస్తి/ఇతర వనరుల (వడ్డీ మొదలైనవి) నుండి ఆదాయాన్ని పొందే వ్యక్తి సహజ్‌‌‌‌ను దాఖలు చేయవచ్చు. బిజినెస్,   ప్రొఫెషన్​ ద్వారా మొత్తం రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు, హెచ్​యూఎఫ్​లు​,   సంస్థలు ఐటీఆర్-–-4ను దాఖలు చేయొచ్చు.  రెసిడెన్షియల్ ప్రాపర్టీల ద్వారా రెవెన్యూ వచ్చే వ్యక్తులు ఐటీఆర్-–-2ను ఫైల్ చేస్తారు.  బిజినెస్/ప్రొఫెషన్ ​ ద్వారా లాభాలు పొందేవారు ఐటీఆర్-–3ను, ఎల్ఎల్పీలు ఐటీఆర్–-5ను, వ్యాపార సంస్థలు ఐటీఆర్–--6ను,  ట్రస్ట్‌‌‌‌లు ఐటీఆర్​–7లను దాఖలు చేస్తారు.