
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ నుంచి వచ్చిన డేటా సెంటర్ల బిజినెస్ అదానీకనెక్స్ రూ.11,520 కోట్లు (1.44 బిలియన్ డాలర్లు) సేకరించడానికి రెడీ అయ్యింది. ఈ కంపెనీ ఎడ్జ్‌కనెక్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ల జాయింట్ వెంచర్. ఇంటర్నేషనల్ బ్యాంకులైన ఐఎన్‌జీ బ్యాంక్ ఎన్‌వీ, ఇంటెసా సన్పాలో, కేఎఫ్‌డబ్ల్యూ ఐపీఈఎక్స్, ఎంయూఎ ఫ్‌జీ బ్యాంక్, నాటిక్సిస్, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్, సొసైటె జనరాలే, సుమిటోమో మిత్సు బ్యాంకింగ్ కార్పొరేషన్‌ల నుంచి ఈ ఫండ్స్‌ను సేకరించనుంది. ఇందుకోసం అగ్రిమెంట్ కుదుర్చుకుంది.
డేటా సెంటర్ బిజినెస్‌లో రానున్న మూడేళ్లలో 1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించింది. 2030 నాటికి మొత్తం కెపాసిటీని ఒక గిగావాట్‌కు పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. 875 మిలియన్ డాలర్ల ఫైనాన్షింగ్ అందుకున్నామని, దీనిని 1.44 బిలియన్ డాలర్లకు పెంచుకోవడానికి వీలుందని అదానీకనెక్స్ పేర్కొంది. కిందటేడాది జూన్‌లో 213 మిలియన్ డాలర్లను సేకరించింది.