బల్లెం వీరుడి గర్భా డ్యాన్స్

బల్లెం వీరుడి గర్భా డ్యాన్స్

భారత స్టార్ జావెలిన్ త్రోయర్..నీరజ్ చోప్రా గర్భా డ్యాన్స్ తో అదరగొట్టాడు.  గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర‌లో జరిగిన దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నాడు.  ముందుగా గ‌ర్భా వేదిక వ‌ద్ద  అతను ప్రత్యేక పూజలు చేశాడు.  ఆ తర్వాత అభిమానులతో కలిసి గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్భా డ్యాన్స్‌ వేశాడు.

నీరజ్ చోప్రా చాలా రోజుల తర్వాత  స్వస్థలం బరోడాకు వెళ్లాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. నీరజ్ చోప్రా గర్బా డ్రెస్ వేసుకుని నవరాత్రి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. నీరజ్ చోప్రాను చూసిన నీరజ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. ఆ  త‌ర్వాత కొంత మంది స‌భ్యుల‌తో క‌లిసి గ‌ర్భా నృత్యాన్ని చేశాడు.

టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా... డైమండ్‌ లీగ్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు.  డైమండ్ లీగ్ ఫైనల్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.ఆ తర్వాత వెకేషన్‌ కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్లి..అక్కడ స్కైడైవిండ్ చేసి ఆకట్టుకున్నాడు.