నారా రోహిత్ ప్రతినిధి 2 మూవీ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

నారా రోహిత్  ప్రతినిధి 2 మూవీ న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

నారా రోహిత్ హీరోగా  మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి 2’. రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు. ఇటీవల సినిమా విడుదల వాయిదా వేసిన టీమ్.. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌‌ను ప్రకటించింది. ‘సిస్టమ్‌‌లోని తప్పులను ప్రశ్నించడానికి వస్తున్నా’ అంటూ మే 10న ఈ చిత్రాన్ని వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.  

పదేళ్ల క్రితం ‘ప్రతినిధి’గా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న నారా రోహిత్ ఈ సీక్వెల్‌‌లో  నిజాయితీ గల న్యూస్‌‌ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నాడు.   సిరీ లెల్లా హీరోయిన్. తనికెళ్ల భరణి, దినేష్ తేజ్, సప్తగిరి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, జిషు సేన్ గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలకపాత్రలు పోషించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.