హనుమకొండ/ భద్రాద్రికొత్తగూడెం/ గ్రేటర్ వరంగల్/ ఖమ్మం టౌన్, వెలుగు: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హనుమకొండలోని 12 సెంటర్లలో పరీక్ష నిర్వహించగా, 4,196 మంది అభ్యర్థులకు 3,764 మంది హాజరయ్యారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కాలేజీలో ఏర్పాటు చేసిన సెంటర్ ను కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.
వరంగల్ జిల్లాలో నిర్వహించిన పరీక్షకు 480 మంది అభ్యర్థులకు 431 మంది హాజరైనట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. జిల్లాలోని సీకేఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజ్సెంటర్ను ఆమె తనిఖీ చేశారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన 7 పరీక్షా కేంద్రాల్లో 2,771 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 2,451 మంది అటెండ్ అయ్యారు.
సీపీ సునీల్‌దత్ జిల్లా కేంద్రంలోని పలు సెంటర్లను పరిశీలించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని నాలుగు సెంటర్లలో 1128 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 959 మంది అటెండ్ అయ్యారు. అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, ఎస్పీ రోహిత్‌రాజు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. కాగా, పలుచోట్ల ఆలస్యంగా సెంటర్లకు వచ్చిన విద్యార్థులను సెంటర్లోపలికి
అనుమతించలేదు.
