- పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
నారాయణగూడ/పంజాగుట్ట, వెలుగు: ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నీట్ పరీక్ష పేపర్‌ను లీక్ చేశారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. వారి చర్యల వల్ల 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు.
ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నారాయణగూడలో నిర్వహించిన ‘చాత్రోంక్ గూంజ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను చదివిస్తుంటే, పేపర్ లీక్‌లతో వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని విమర్శించారు.
ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమన్నారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివాసి కాంగ్రెస్ నేషనల్ చైర్మన్ డాక్టర్ విక్రాంత్ భూరియా, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ తో కలిసి ‘చాత్రోంక్ గూంజ్’ కార్యక్రమంలో మహేశ్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.
