హైదరాబాద్ ఫ్యామిలీలకు అలర్ట్.. జూపార్క్ చార్జీలు పెరిగాయ్..!

హైదరాబాద్ ఫ్యామిలీలకు అలర్ట్.. జూపార్క్ చార్జీలు పెరిగాయ్..!
  • విదేశీ టూరిస్టులకు ప్రత్యేకంగా ఎంట్రీ ఫీజులు
  • ఫారెస్ట్ శాఖ మంత్రి కొండా సురేఖ సమక్షంలో జాపాట్‌‌ బోర్డు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: నెహ్రూ జూలాజికల్ పార్క్ రేట్లను పెంచుతూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. జూపార్క్ ఎంట్రీ ఫీజుతో పాటు, లోపల లభించే వివిధ సేవల చార్జీలను పెంచారు. పెంచిన కొత్త రేట్లు నేటి నుంచి(ఆగస్టు 1) అమల్లోకి రానున్నాయని, జూపార్క్ క్యూరేటర్ శుక్రవారం తెలిపారు. తెలంగాణ జూస్ అండ్ పార్క్స్ అథారిటీ (జాపట్) 15వ గవర్నింగ్ బాడీ సమావేశం అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చాంబర్‌‌‌‌లో నిర్వహించారు. 

ఈ సమావేశంలో జూ పార్క్ నిర్వహణ, సందర్శకులకు మెరుగైన వసతుల కల్పన దృష్ట్యా చార్జీలు పెంచాలని బోర్డు నిర్ణయించింది. విదేశీ టూరిస్టులకు స్పెషల్‌‌గా కొత్త రేట్లను ఖరారు చేశారు. నెహ్రూ జూలాజికల్ పార్క్‌‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు, జంతువుల సంరక్షణ, టూరిస్టుల సౌకర్యార్థం ఈ ధరల పెంపు అనివార్యమైందని మేనేజ్‌‌మెంట్ వెల్లడించింది. సందర్శకులు, నగర ప్రజలు ఈ మార్పులను గమనించి, పార్క్ అభివృద్ధికి, నిర్వహణకు సహకరించాలని క్యూరేటర్ కోరారు.

సవరించిన నూతన చార్జీలు

సేవల వివరాలు    ప్రస్తుత ధర (రూ.ల్లో)    ఇండియన్స్‌‌కు  కొత్త ధర (రూ.ల్లో)    విదేశీయులకు  కొత్త ధర (రూ. ల్లో)
ఎంట్రీ ఫీజు(పెద్దలు)     100    120    1000
ఎంట్రీ ఫీజు( పిల్లలు)    50       60     500
సఫారీ (ఏసీ) - ఒకరికి    150    165    300
సఫారీ (నాన్ ఏసీ) - ఒకరికి    100    110    200 
బ్యాటరీ వాహనం(బీఓవీ) పెద్దలు    120    135    400
బ్యాటరీ వాహనం (డీఓవీ)  పిల్లలు    70    75    300
స్టిల్ కెమెరా    150    500    500
వీడియో కెమెరా    250    500    500
మూవీ కెమెరా    10,000    10,000    10,000
లెన్స్ & ట్రైపాడ్ సెటప్‌‌ తో కెమెరా    0    700    700